ఘనంగా వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి.
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తా లోని ఆమె విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆమె కు ఘనంగా నివాళులర్పించారు. పులిమాటి సంతోష్ కుమార్ , పెద్దెలి శేఖర్ మాట్లాడుతూ దున్నే వారికె భూమి వెట్టి చాకిరీ విముక్తి కోసం ధేశ్ ముఖ్ , రజాకార్ల పై ఎదురు తిరిగి పోరాడిన వీర వనిత అని కొనియాడారు.
స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలను వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన అన్నారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో నే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా నాయకులు ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిమాటి సంతోష్ కుమార్, జిల్లా నాయకులు పెద్దెల్లి శేఖర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.