ఘనంగా సామూహిక వివాహాలు

బోధ్‌: బోధ్‌ మండలంలోని రెడ్లపల్లి గ్రామంలో మహదేవ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది జంటలకు ఘనంగా సామూహిక వివాహాలను జరిపించారు. ఈ సందర్భంగా మహదేవ్‌ సంఘం అధ్యక్షుడు మీస్రం సుదర్శన్‌ మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చేయూత అందించేందుకు ఈ సామూహిక వివాహాలను జరుపుతున్నట్లు తెలిపారు.