చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో చికిత్స చేయించిన ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.