చేతుల సోమయ్య భౌతికదేహానికి నివాళులు అర్పించిన తాళ్లూరి పంచాక్షరయ్య.

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర తె రా స నాయకులు మాజీ ఎంపిటిసి సభ్యులు చేతుల వీర్రాజు తండ్రి చేతుల సోమయ్య శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన తాళ్లూరి పంచక్షరయ్య, స్థానిక మండల జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, తె రా స మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తె రా స మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, తాళ్లూరి శ్రీహరి, మొరంపల్లి బంజార ఉపసర్పంచ్ కైపు లక్ష్మినారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు కైపు సుబ్బిరామిరెడ్డి, తె రా స మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, కగేందర్ రెడ్డి, ధనుగూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.