జగిత్యాల జైత్రయాత్రకు నేటితో 35 ఏళ్లు

తెలంగాణ గతిని మార్చనున్న హైదరాబాద్‌ మార్చ్‌?
3.50 లక్షలమందిలో ఊరేగింపు
యాత్రతో స్వేచ్ఛ ఎన్నింటికో స్ఫూ ర్తి శ్రీవార్‌ ఉద్యమంలో ఓ ప్రయోగశాల
జగిత్యాల , సెప్టెంబర్‌ 08(జనంసాక్షి) :
దొర ఏందిరో.. వాడి దూకుడేందిరో.? జాలీమ్‌ క్యారే .. ఉసుకా జూలూం క్యారే..? వెట్టిబతుకులు ఏందిరా? అటు చూసిన బతుకులకు విముక్తి కోసం, రైతులు, రైతు కూలీలు, రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిర్వహించిన జైత్రయాత్రకు ఆదివారంతో 35 ఏళ్ళు (9-9-1978) నాటి జైత్ర యాత్ర సామాన్యుడి స్థితిగతినిమార్చగా ఊరేగింపులో స్వేచ్చ, ఏన్నింటికో స్ఫూర్తి నిచ్చింది. సీమాంధ్రపాలకుల పెత్తనంను నిరశిస్తూ, ప్రత్యేక రాష్ట్రసాధనకోసం జేఎసీ ఆధ్వర్యంలో ఈనెల 30న జరుగనున్న హైదరాబాద్‌ మార్చ్‌ ఈ ప్రాంతగతినే మార్చనున్నట్లు విప్లవ పార్టీల సానుభూతిపరులు తెలంగాణవాదులు, మేధావులు, చరిత్రకారులు భావిస్తున్నారు. జైత్రయాత్రకు హైదరాబాద్‌ మార్చ్‌కు సెప్టెంబర్‌ మాసం వేదిక కావడం గమనార్దం. జైత్రయాత్ర పిదపనే రైతుకూలిసంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్‌వార్‌గా ఆవిర్భవించింది. వార్‌ ఉద్యమ చరిత్రలో జైత్రయాత్రకు విశిష్టస్తానముంది. వార్‌ఉద్యమ విసృ ్తతికి జైత్రయాత్ర ప్రయోగశాలగా మారి దేశంలో 17 రాష్ట్రంలో ఉద్యమ వ్యాప్తికి దోహదపడింది. రహదారులు, వాహణ సౌకర్యాలు అరకొరగా ఉన్నదశ లో పట్టణాలకు కొంతమేరకు పరిమితమైన ప్రచార సాధనము దండెపల్లి, జన్నారం, ఖానాపూర్‌, లక్ష్మిజుపేట్‌ ప్రాంతాలతో పాటు జిల్లావాసులు మూలనుంచి దాదాపు3.50 లక్షల మంది జగిత్యాల జైత్రమాత్రలో పాల్గొన్నారు. పోలీస్‌ రికార్డుల్లో నమోదైన లెక్కల మేరకు గొంగడి, చేతిలో కర్రలు, కాలినడకన, ఎడ్లబండ్ల, లారీల ద్వారా రైతులు, రైతు కూలీలు, సద్దిమూటలు కట్టుకుని చేరారు. వెట్టిచాకిరి నిర్మూలించాలి. కూలిరేట్లు పెంచాలి. దునేవాడికే భూమి అంటు తదితర డిమాండ్లతో పట్టణ పుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించి కళాశాల మైదానంలో (ప్రస్తుతం మినీ స్టేడియంలో) బహిరంగసభ జరిగింది. మావోయిస్టు అధినేత ముప్పళ్ళ లక్ష ్మణ్‌రావు అలియాస్‌ గణపతి, ముళ్ళజుల కోటేశ్వర్‌రావు, అలియాస్‌ కిషన్‌రెడ్డి, మాదాసు వేణుగోపాల్‌, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్‌, ముంజీం రత్నయ్య, బైరి గంగారాం, అంగె ఓదేలు, తదితరనేతలు నాటి జైత్రయాత్ర నిర్వాహకులు ముక్కు సుబ్బారెడ్డి, అద్యక్షుతన జరిగిన బహిరంగసభలో ప్రజాయుద్ద నేత గద్దర్‌ గజ్జకట్టి ఆడిపాడారు.
జీవన గతిన మార్చిన జైత్రయాత్ర:
జైత్రయాత్ర జిల్లా జీవనగతిని మార్చి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. రైతుకూలీ సంఘం కొండపెల్లి సీతారామయ్య నేతృత్వరలో పీపుల్స్‌వార్‌ ఆవిర్భవించింది. ప్రభుత్వం ఉద్యోగాన్ని వదిలి సాయుదపోరాటాన్ని చేతబట్టిన బి.ఎస్‌.రాములు దళిత సాహిత్యాన్ని సృష్టించారు. మానవహక్కుల సంఘం, విప్లవ రచనల సంఘాలు ఈ జైత్రయాత్ర ద్వారా ఎన్నో పురుడుపోసుకున్నాయి. పల్లె ప్రాంతాలలో అన్ని రంగాలలో, శ్రామికులు, కర్షకులు, బడుగుబలహీన వర్గాలవారు అనచివేతకు, దోపిడీకి గురవుతున్న ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఈజైత్రయాత్ర ప్రసాదించిందిగా చెప్పుకోవచ్చు. గ్రామాలలో పంచాయితీలు నిర్వహించడానికి పంచాయితీలు డిపాజిట్‌లు పెట్టించుకునే భూస్వాములు ఈ ఉద్యమం ద్వారా వెనుకంజవేశారు. అంటరాని తనం కొంతమేరకు తగ్గింది. పాలేర్ల జీతాలు పెరిగి వారికి స్వేచ్చ వచ్చిందనేది జైత్రయాత్రతో సత్యం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సాధనకు జెఎసి నేతల ఆద్వర్యంలో ఈ నెల 30న జరుగుతున్న హైదరాబాద్‌ మార్చ్‌లో ప్రత్యేక రాష్ట్ర గతి మారడం కాయమని నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రాంత వాసులకు ఏర్పడింది. హైదరాబాద్‌ మార్చ్‌కు ఈరోజు హైదరాబాద్‌ లో పాదయాత్రకు శ్రీకారంచుట్టడం ప్రస్థావనాంశం. తెలంగాణ జైత్రయాత్రను విజయవంతం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను సాధించుకుందాం.