జమ్మూకాశ్మీర్‌ను రక్షించుకుందాం

ఖమ్మం, జూలై 20: జమ్మూ కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని, దానిని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీయే ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్ట విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. కమిటీ నివేదిక దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. భారతీయులంతా ఖండించాలన్నారు. ఈ నివేదికను సమర్పించిన వారిలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర వాదులు నిర్వహించిన భారత వ్యతిరేక సెమినార్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ నివేదికను దొడ్డిదారిన ప్రవేశపెట్టి దేశ ప్రజలకు తీరని ద్రోహాన్ని తలపెడుతున్నారని ఆయన ఆరోపించారు.