జిల్లా కోసం మోకాళ్లపైఅర్ధనగ్న ప్రదర్శన..

జాతీయ నాయకుల విగ్రహాలు ముందు నిరసన…!
మిర్యాలగూడ, జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆదివారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నల్గొండ రోడ్డులో గల “వై”జంక్షన్ వద్ద జాతీయ నాయకుల విగ్రహాల ముందు మోకాళ్లపై కూర్చుని అర్థనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా ఏర్పాటును ప్రజలు బలంగా కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమ తీవ్రత ప్రజల్లో బలంగా ఉందని ప్రభుత్వం గుర్తించి మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ ఫరూక్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ మాదిగ హక్కుల దండోరా మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి సైదులు మాదిగ, ఎస్పీ నాయుడు, సామాజికవేత్త జానీ బాబా కేతావత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.