జిల్లా మహిళ,శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ సంబరాలు…..

ములుగు బ్యూరో,సెప్టెంబర్24(జనం సాక్షి):-
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు తెలంగాణ  సంస్కృతి సాంప్రదాయాల ఆడపడుచుల వేడుక బతుకమ్మ పండుగ అని కలెక్టరేట్ కార్యాలయంలో ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడం సంతోషకరమని డిఆర్ఓ కే. రమాదేవి అన్నారు.శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మహిళాలు,పిల్లలు,దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బొడ్డెమ్మ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డిఆర్ఓ కే రమాదేవి హాజరై మహిళలతో కలిసి బొడ్డెమ్మ బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు.సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి హేమలత మాట్లాడుతూ మహిళలు పిల్లల సంరక్షణక్తై 1098,సఖి సేవలకై 181,అంగన్వాడి,హెల్ప్ లైన్ కోసం155209 దివ్యాంగుల కోసం హెల్ప్ లైన్18005728980, వయోవృద్ధుల కోసం 14567 కు ఫోన్ చేసి మహిళ, శిశు,  వయోవృద్ధుల  రక్షణకు ఏర్పాటు చేసిన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని హేమలత, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల సబ్ రిజిస్టర్ తస్లీమా మమ్మద్, షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి అధికారి భాగ్య లక్ష్మి,కలెక్టరేట్ మహిళా సిబ్బంది,అంగన్వాడి సూపర్వైజర్లు ,అంగన్వాడి టీచర్లు
మహిళలు తదితరులు పాల్గొన్నారు.