‘టీమిండియా ప్రపంచ కప్ స్వ్కాడ్ ఇదే..

 వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభ తేదీ దగ్గరపడుతోంది. త్వరలో దీని కోసం భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రపంచకప్‌నకు ముందు 2023 ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా అన్ని రంగాల్లో సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆసియా కప్‌నకు జట్టు ఎంపిక తర్వాత, ఇప్పుడు ప్రపంచకప్ జట్టు దాదాపుగా క్లియర్ అయింది. అందుకే చాలా మంది మాజీ భారత ఆటగాళ్లు తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తున్నారు. ఇందులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరాడు.ఆసియా కప్ 2023 కోసం భారత్ 17 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అయితే, ప్రపంచ కప్‌నకు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ప్రపంచకప్‌నకు కూడా దాదాపు ఆసియా కప్‌తో సమానమైన జట్టు ఉంటుందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.