ట్రాలీఆటో యూనియన్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా రొయ్యల రవి, ఎండి అక్రమ్
స్టేషన్ ఘన్పూర్ , సెప్టెంబర్ 25,( జనంసాక్షి ) :
మండలంలోని తాటికొండ ట్రాలీఆటో, టాటాఏసీ (గూడ్స్),బొలెరో వాహనాల యూనియన్ అధ్యక్షు డిగా రొయ్యల రవి, ఉపాధ్యక్షుడిగా ఎండి అక్రమ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తాటికొండ ట్రాలీ ఆటో, టాటాఏసీ (గూడ్స్), బొలెరో వాహనాల యూనియన్ గ్రామ నూతన కమిటీని తాటికొండ గ్రామంలో ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా రొయ్యల రవి, ఉపాధ్యక్షుడిగా ఎండి అక్రమ్,
గౌరవ అధ్యక్షుడిగా ఎండీ మోసిన్అలీ,కోశాధికారి గా గుర్రం రాజు, ప్రధాన కార్యదర్శి బాదావత్ వీర న్న, కార్యదర్శి సయ్యద్ మహమ్మద్, కార్యవర్గ స భ్యులుగా మంద మల్లేష్,ఎండి అజిమ్,రొయ్యల పవన్ కళ్యాణ్, తిరుపతి,ఎండి కుర్బాన్, రొయ్య ల రాజ్ కుమార్, రొయ్యల శివ, జి రమేష్, ఎండి సోహైల్ లను నూతనంగా ఎన్నుకున్నారు.ఈ సం దర్భంగా నూతన అధ్యక్ష ,ఉపాధ్యక్షుడు రొయ్యల రవి,ఎండి అక్రమ్ మాట్లాడుతూ తాటికొండ గ్రామ ట్రాలీ, టాటాఏసీ (గూడ్స్),బొలెరో వాహనా యజ మానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారా నికై నిరంతరం కృషి చేస్తామని అన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికికృతజ్ఞతలు తెలిపారు.