డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల ఖాళీల భర్తీ

శ్రీకాకుళం, జూలై 25 : జోన్‌-1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఒప్పంద అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జిఎం మొజెస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం-1, గణితం-1, ఫిజిక్స్‌-1, కెమిస్ట్రీ-4, బోటనీ-2, జువాలజీ-2 చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 55 శాతం మార్కులతో పిజి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోగా స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌కు, 30లోగా రాజమండ్రిలోని తమ కార్యాలయానికి సంప్రదించాలని కోరారు. ఇతర వివరాలకు 0883-2442324 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.