తెలంగాణకు ప్రణబ్‌ అనుకూలమట !


ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీల నిర్ణయం

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన అవగాహన ఉండటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారనే కారణంతోనే ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్టు టీ కాంగ్రెస్‌ ఎంపీలు గురువారం ఢిల్లీలో ప్రకటించారు. తాము ప్రణబ్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈ మేరకు సంతకాలు కూడా చేశామన్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ రాజకీయం చేయడం తగదని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్టు టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు.