తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఏ పావురాలైతే మమ్మల్ని సూసి హడావిడి సేసే వో-ఏవైతే మా భుజాలెక్కి ఆటలాడేదో ఏవైతే మా బుగ్గల్ని ముద్దాడేవో ఏవైతే మా గురయ్యగాడి కోసం కళ్ళు తెరచుకొని ఎదురు చూసేవో ఆ చు క్కల పావురం,కుంటిపావురం ప్రాణం పోయి నెత్తురు మడుగులో.. కొద్దిసేపటి ముందే వున్నె ట్టుంది,అయి పాణంపోయి..సీమలు పట్టడా నికి గుంపులు గుంపులుగా బారులు తీరుతూ కన్పడి నాయ్‌..

ఆ తర్వాత భయంతో చుట్టూ కలయసూసిన. దర్గా మైదానం నిండా ముక్కు నుండి రక్తం కారి సచ్చిపడి వున్న పావురాల్లు నన్ను సూసి భయంతో బిక్కుబిక్కుమంటున్న గూళ్ళలో ఎగరలేని,వాటికవే గింజలు తినలేని తల్లిసాటు పిల్ల పావురాల్లు-ఆక లితో అలమటిస్తూ తమ తల్లులకోసం ఎదురు చూస్తున్న ఆ పిల్ల పావురాల్లు హృదయవిదా రకం గా రోదించడం షురూ చేసినయ్‌,యా అల్లా క్యా హువా అని గట్టిగా అరిచాను. నా అరుపు వి ని పిల్లలకు మదరసా పాఠాలు చెప్పాలని వచ్చిన మౌల్వీసాబ్‌, గాజుల్లా టీ స్టాల్‌ నుంచి పరుగెత్తుకొ చ్చారు.ఆయన ఎనక ఇంకా జనం…అందరి కళ్ళల్లో అక్కడి దృశ్యం చూసి భయం, బెదురూ..

అందరూ అక్కడ చల్లిన గింజల్ని గురించి ఎదేదో మాట్లాడుకొంటాండరు. టీ కొట్టు గాజుల్లా క్యా హైకి భై, పాంచ్‌ బజె దుఖాన్‌ ఖోలా ..గఫార్‌భై ఆయేతక్‌ కోయిబి అందర్‌ నై గయే…యా అల్లా! ఏ కైసా హువాకీ ..క్యాకి..దుష్మన్‌ కోన్‌కి.. యే మూ నైసో పరిందే క్యా కరీంభై ఉస్కో ..అంటూ ఏదో శపిస్తున్నాడు. ఇంకా ఎవరెవరో ఏదేదో శపి స్తున్నారు. నేనదేమి పట్టించుకోలేదు. నా కళ్ళు నారత గురయ్యకోసం వెదుకుతున్నాయి. వాడు ఈ దృశ్యం సూస్సే అసలు తట్టుకుంటడా? అని అన్పించింది నా మదిలో,నా కాళ్లు గురయ్యగాడి దగ్గర్కి పరుగులు తీసాయి.

ఇంటి దగ్గర గురయ్యోల్లమ్మను చూసి పెద్దమ్మ! పెద్దమ్మ! గురయ్యెక్కడా? అని రొప్పుతు రొప్పుతూ అడిగానా.

‘తెల్లార్జామున నాలుగ్గంటలకే ఎల్లినాడు- ఎల్లేప్పు డు సేతిసంచిలో రొన్ని జొన్న గింజలు కూడా తీస్కోని పోయినాడు పావురాలకు సల్లాలని..అట్నే బద్దేల్లో అదేదో వాల్ల స్వయం సంగమోల్ల మీటిం గంటబ్బీ ..ఆడికి పోవాలని సెప్పి పోయినాడు’ అనింది.

ఇంక నాకేమి యిన్పించడంలేదు. మల్లీ దర్గా దగ్గ రికి పర్గెత్తినా-దర్గా గుమ్మం దగ్గరికి..జీవం లేకుం డా పడున్న ఖబూతరాంల మధ్య కుప్పకూలి పోయినా…

-షేక్‌పులివీడు గఫార్‌

సండాస్‌

‘ఏమైంది…వలీమా అయి ఒక్కరోజన్న కాలే, అ ప్పుడే పోవుడేంది? ఏ ఇంట్లనన్న ఉన్నదా గిసుంటి రీతిరివాజు?’ జలీల్‌ వాళ్ళ నానీమా పాన్‌దాన్‌ల ఊంచుకుంట అన్నది.

‘ఆ పిల్లకు కడుపుల నొప్పి తగ్గనే లేదు..ఏమన్న యితే ఎట్ల.పోతనంటె పంపిస్తున్న అమ్మీ’ అన్నది జలీల్‌ అమ్మీజీ.

‘గట్లనా…ఎందుకయ్యింది గట్ల….? జలీలేమన్న తొందర పడ్డడా ఏందీ…?’ చిన్నగ అన్నది నానీమా.

‘సాజీదా అడిగితే అట్లాంటిదేం లేదన్నదంట. మరెందుకట్లయితందో ఏమో…మెలికలు తిరగ బట్టె . డాక్టరు కాడికి పోదమంటే వద్దంటున్నది’ అన్నది అమ్మీజీ.

ఈ మాటలన్ని చిన్నగ అర్రలున్న షమీమ్‌కు ఇనబ డ్తనే ఉన్నయ్‌.నయి బహు.. అందరే మనుకుంటు న్రో అని కళ్ళెంబడి గిర్రున నీళ్ళు తిర్గినయ్‌ షమీ మ్‌కు. అప్పటికి ఆమె పుట్టింటికి పోనికి మొత్తం తయారై కూసొనుంది.

జలీల్‌ ఆమె దగ్గరికొచ్చి ‘ఎట్లున్నది’ అన్నడు.కళ్ళల్ల నీళ్లతోని చూసిందిగని ఏం మాట్లాడలె షమీమ్‌. ‘సరె, ఇగ లే పోదాం. మల్ల లేటయితే కష్టం’ అని సూట్‌కేస్‌ పట్టుకోని లేవదీసిండు. ఇద్దరు గల్సి బైటికొచ్చిన్రు.

ఇంక కొంతమంది దగ్గరి చుట్టాలు పోనేలేదు. పందిరి కింద అక్కడక్కడ చేరి మాట్లాడుకుంటు న్రు. వాళ్ళంతా తన గురించే మాట్లాడుకుంటున్రో ఏమోనని షమీమ్‌కి ఒకటే ఏడుపు తన్నుకొస్తుంది.

అందరి దగ్గర అలాయిబలాయి తీస్కోని సలామ్‌ చేసి రొడ్డుమీది కొచ్చిన్రు. పక్కనున్న టౌన్‌కు పోతె అక్కడ్నుంచి షమీమ్‌ వాళ్ళూరుకు బస్సులు దొర్కుతయ్‌. ఆటో ఎక్కిస్తాన్కి అమ్మీజి, సాజిదా, జలీల్‌ తమ్ముడు ఖలీల్‌ వచ్చిన్రు. ఆటో ఎక్కి టౌన్ల దిగేసరికి షమీమ్‌ వాళ్ళూరు బస్‌ తయారున్నది. ఎక్కి కండక్టర్‌ ఎనక సీట్ల కూసున్నరు. కళ్ళు మూ తలు పడ్తున్నయ్‌ షమీమ్‌కు. ఆమె అవస్థ చూసి తన వళ్ళో పడుకోబెట్టుకున్నాడు జలీల్‌. ఆమెకు ఒక్కసారిగా దుక్కం పొంగుకచ్చింది.ఆమె తల నిమురుకుంట కళ్ళు మూసుకున్నడు.చిన్నగ కళ్ళు తుడుసుకున్న షమీమ్‌కు తమ ఇల్లు, బహెన్‌లు, అమ్మీ, దాదీమా అంతా గుర్తుకు రాసాగిన్రు .ఆమె మనసు ఒక్కోక్కళ్ళను పలకరించుకుంట ఒక్కోమె ట్టు ఎక్కుకుంట అళ్ళింటికి పొయింది…..’మా భాయి పెద్ద కూతురి నిఖా. అంటే ఖాన్‌దాన్‌లనే బడీ బేటీ! అందరం ఎళ్ళాలె. ఎల్లకుంటె బాగుం డదీ, అన్నీ తయారు చెయ్యి’ భార్యకు ఆర్డరేసిండు షమీమ్‌ వాళ్ళ అబ్బాజాన్‌ సిరాజుద్దీన్‌.’షమీమ్‌ రాదంట అబ్బా’ ఫిర్యాద్‌ చేసింది పెద్ద చెల్లె ఫర్హా నా.కైకు నై ఆతీ? ఇంట్ల ఒక్కతై ఎట్లుంటదంట’ కోపంగన్నడు సిరాజుద్దీన్‌. ‘గాల్లింట్ల పాయ్‌ఖానా దొడ్లు గలీజుగుంటయని రానంటుంది’ చెప్పింది ఫర్హానా.

ఒక్కరోజు కేమయింతది. ఏం గాదు, అందరు తయారుకండ్రి, సమ్జయిందా’ గట్టిగన్నడు సిరా జుద్దీన్‌.కిక్కురు మనకుంట అందరు తయారైపొ యిండ్రు. బండెక్కినంక అందరు సీరియస్‌గ ఉన్న రని ‘దీన్ని అడుక్కునేటోడికిచ్చినా ఏమనదిగని ఇంట్ల పాయ్‌ఖానా మంచిగున్నోని కియ్యాలె’ అన్న డు.

అందరు నవ్వేసిన్రు. షమీమ్‌ వస్తున్న నవ్వుని ఆపుకుంట బలవంతంగా తల పక్కకి తిప్పుకుంది.

షాదీ కెళ్ళొచ్చిన్రు. అక్కడ బాగా ఏడ్చిన్రు. ఆ రాత్రి సిరాజుద్దీన్‌కు గుండెనొప్పి వచ్చింది. ఏడ్సుట్ల మొత్తుకొనుట్ల ఆయన అన్నదమ్ములందరు కల్సి దవాఖానల ఏసిన్రు గని ఆయన బతకలె. ఆ ఇల్లంత చీకటైపొయింది. అందరి మొఖాలు పాలి పొయ్యి, ఏదో జీవి రక్తం మాత్రం పీల్చేసినట్లు అయ్యిన్రు అంతా.

గట్ల గట్ల ఏడాది ఎల్లిపొయింది.ఒకరోజు మరు ్దలిద్దరికీ, బావకి కబురుపెట్టి బిడ్డ షాదీ చెయ్యా ల్నని, మళ్ళ వయసు ముదిరితె ఎవలు చేసుకుంట రని, ఎట్లాంటిదో ఒకట్లాంటిది సంబంధం చూడ మని, పిలగాడు మంచోడయితే సాలని చెప్పి ఏడ్చింది ఖాజాబీ.

అప్పుడు వాళ్ళందరు కలిసి గీ సంబందం చూసిన్రు. కట్నం ఏబై వేలే, సైకిలు షాపు సొంతం గా నడుపుతున్నడని ఇంతకంటె మంచి సంబం దం దునియాల ఏడ దొరకదని వాళ్ళు గట్టిగ చెప్పిన్రు. ఇగ చేసేదేం లేక ఆ సంబందాన్నే కాయం చేసుకున్నరు.

షాది మంచిగనె అయ్యింది. పిల్లెంబడి తోడుగ ఉండకుంట ఎల్లిపొయ్యింది.

లేవగానే చాయ్‌ తాగి బయటికెళ్ళటం అలవాటు షమీమ్‌కి. చాయ్‌ అయితే తాగింది గని లెట్రిన్‌ ఎక్కడుందో తెలియక పాయె. ఆమె ననన్‌ (ఆడబిడ్డ)ను అడిగితే ఇంటెనకున్నది ఎళ్ళమని లోటాల నీళ్ళిచ్చింది.

లోటాల నీళ్ళెట్ల సరిపోతయ్‌ అన్పిచ్చి లోపలుం డొచ్చులే అనుకుంట ఇంటెనక్కి పోయింది. అక్కడామెకు ఏం కనపళ్ళే – చుట్టూ చూసింది. ఒక మూలన నాలుగు కర్రలు పాతి ఉన్నయ్‌.

వాటి చుట్టు గోనె సంచులు, తాటికమ్మలు కట్టి ఉన్నయ్‌. దానికి తలుపులాగ కూడా అడ్డంగ ఒక కర్రున్నది. దానిగ్గూడా గోనెపట్టా ఏళ్ళాడబడ్తు న్నది.

అంతలో అందులనుంచి గోనెసంచి జరుపుకుంట ఒకామె బైటకొచ్చింది లోటా బట్టుకొని.’జాతే ? జావ్‌. మైం యాం ఖడేతిమ్‌ లేవ్‌!’ అని అక్కడకు కొద్ది దూరంల ఎవర్రాకుంట నిలబడ్డది.ఈమె చూడ కుంటెనన్న ఎనక్కి తిరిగి పోయెడిది. ఇగ ముందుకే వెళ్ళింది షమీమ్‌.

భయంభయంగా లోపల కడుగుపెట్టింది. ఒక్క సారే గుప్పుమని మురుగు కంపు కొట్టింది. పల్లోని ముక్కుకి అడ్డం పెట్టుకుని కళ్లని కిందికి తిప్పి చూసింది. కింద మలంతో నిండుకొస్తున్న గొయ్యి. దాన్నిండా లుకలుకలాడ్తున్ను పురుగులు. జిబ జిబ… దానిమీద కూర్చోడానికి వీలుగా రెండు చెక్కలు మట్టితో కప్పి ఉన్నయి. ఆమెకి ఊపిరా డలేదు. వాసనకి ఎంటనే బయట కురికొచ్చింది. పేగులు లుంగజుట్టుకొని భళ్ళున కక్కుకుంది.’సండాస్‌మే కబ్బీ నయ్‌ గయే క్యావ్‌?’ అని అడిగింది బయట నిలబడ్డామె. కొద్దిసేపు చెవులు పట్టి తర్వాత మొఖం కడిగించి అర్రలకి తీస్కపొయ్యి ‘ఆరామ్‌ కరో బేటీ’ అని బయటకెళ్ళి పోయ్యింది.

కొద్దిసేపటికి స్నానానికి పిలిచింది సాజిదా. స్నానం చేసి మళ్ల అర్రల కొచ్చి పడ్డది. లోపలికే అన్నం వచ్చింది. కొత్త దుల్హన్‌ని ఏ పని చేయ నియ్యరు. అన్నం తిననని చెప్పింది జలీల్‌తో అత ను బలవంతంగ రెండు ముద్దలు తినిపించిండు. షమీమ్‌కి తన బాధ ఎవరికి చెప్పాల్నో సమజ్‌ కాలె. ఏదైనా మాయ జరిగి పుట్టింట్ల పడితె బాగుండనిపించింది. అసలు వీళ్లయినా దాంట్లకే ఎట్ల పోతున్నరు! ఛోటీ నన్‌ కాలేజ్‌ చేస్తుంది. ఆమె గూడ అందులకే ఎట్ల పోతున్నదో.. వెన్నము ద్దల్లెక్క ఉన్న ముగ్గురు ననన్‌లు ఇన్ని రోజుల్నుంచి సండాస్‌లకే ఎట్ల ఎల్తున్రో ఏమో… పాపం, అమ్మీజీ – షాదీ అయినకాణ్నించి అందులకే ఎల్తుందని తల్చుకుంటే బాదగావుంది. గరీబు ముస్లిం ఆడోళ్లందరి బతుకులు ఇంతేనా?! ఊర్ల ముస్లింలు కానోళ్లంతా ఊరి బైటికెళ్తరు గదా.. వీళ్లు గూడ ఎల్తేంది?? అని సోంచాయించుకుంట కూసుంది షమీమ్‌.

మద్యానం జలీల్‌ షమీమ్‌ ఉన్న అర్రల కొచ్చిండు. సుస్తుగున్న షమీమ్‌ను చూసి ‘క్యా బాత్‌ హై, అట్లున్నవేంది?’ అన్నడు.

‘ఏం లేదు. మంచిగనె ఉన్న’ అన్నది తలొంచుకొని షమీమ్‌?కొద్దిసేపు మాట్లాడి పెదాల్ని ముద్దు పెటు ్టకొని బయటికెళ్ళిండు జలీల్‌. సిగ్గుతో ముసుగులో మొహం దాచుకుంది షమీమ్‌.

సాయంత్రమైంది. మత్తు జల్లినట్లు చిన్నగ తెల్వ కుండనె అంతట చీకట్లొచ్చినయ్‌. దీనికోసమే కాసుక్కూచుంది షమీమ్‌. చీకట్ల నయితె ఏం కనబడది, ముక్కు గట్టిగ మూసుకొని వెళ్ళొచ్చు అనుకుంట ఎనిమదయితంటె లోటా పట్టుకొని సండాస్‌ కెల్లి నడిచింది.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…

తాజావార్తలు