అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది.ఈ మేరకు బుధవారం రాత్రి ఓ ప్రకటన జారీ చేసింది. ప్రాథమిక దర్యాప్తులోని అంశాలు, విమాన ప్రమాదంపై వస్తున్న వ్యాఖ్యానాల పైనా మండిపడిరది. ‘’పైలట్స్ అసోసియేషన్ ప్రతినిధులను దర్యాప్తు నుంచి దూరంగా ఉంచడంపై మా అసంతృప్తిని తెలియజేశాం. ప్రాథమిక నివేదికను అన్వయించడం, దానిని బహర్గతం చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఎంచుకొన్న అంశాలను మాత్రమే ప్రస్తావించారు. అది పైలట్ల తప్పు అని చిత్రీకరించేటట్లు ఉంది. అటువంటి వైఖరి వల్ల ప్రయోజనం లేదు. సభ్యులు, ప్రజలు ఇప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దని కోరుతున్నాం.అసలు పారదర్శకత, డేటా ఆధారిత, సమగ్ర దర్యాప్తు జరగకుండానే నిందను మోపడం తొందరపాటు అవుతుంది. అలాంటి వ్యాఖ్యలు అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన సిబ్బంది ప్రొఫెషనలిజంను దెబ్బతీస్తాయి. దీంతోపాటు వారి కుటుంబసభ్యులు, ఆత్మీయులను అనవసరమైన బాధకు గురిచేస్తాయి’’ అని పేర్కొన్నారు.ఇక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్ పైలట్స్ కూడా ముందస్తుగా నిర్ణయాలకు రావడంపై హెచ్చరించింది. ప్రాథమిక నివేదిక సహజంగానే ఎటువంటి సమాధానాలు అందించదని.. మరిన్ని ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యేవరకు సంయమనం పాటించాలని కోరింది. ఎయిరిండియా 171 విమాన కెప్టెనే ఇంధన స్విచ్‌ను షట్‌డౌన్ చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం ప్రచురించడాన్ని తప్పుపట్టారు.ఎయిరిండియా ఏఐ 171 ప్రమాదంపై ఇటీవలే ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లన్లు షట్‌డౌన్ కావడం, ఆ తర్వాత చేసిన రికవరీ ప్రయత్నాలు విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధరించారు. ఇక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కీలక భాగాలను విశ్లేషించింది. దీంతోపాటు పోస్టుమార్టం రిపోర్టులు, పరికరాల తనిఖీలను ఇంకా నిర్వహిస్తోంది. ఇప్పటికే బోయింగ్ 787-8కు సంబంధించి, జీఈఎన్‌ఎక్స్-1బీ ఇంజిన్లకు సంబంధించి ఎటువంటి అడ్వైజరీని జారీ చేయలేదు.ఈ ఘటన తర్వాత ఎయిరిండియా సంస్థ తమ బోయింగ్ 787-8 విమానాల్లో ఇంధన స్విచ్‌ల తనిఖీలు నిర్వహించింది. వీటిల్లో అన్నీ సజావుగానే ఉన్నట్లు తేలిందని సంస్థ వెల్లడిరచింది.