తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అయిన్పటికీ ముస్లిం యువతకు ఉద్యోగ హక్కు కోసం, పని హక్కుకోసం, ఉపాధి హక్కు కోసం సంఘటితం చేసే ప్రయత్నం చేయరాదా అని ఎవ్వరిని అడిగినా మేము చేస్తే ఏవో ముద్ర లువేస్తారు.ఐఎస్‌ఐఅంటారు,తీవ్రవాదం అంటారు అని జవాబు ఇస్తారు. ఇది ఒక్కోకసారి తమ అనా సక్తిని వెతకుకునే సాకే కావచ్చును గానీ నిజమైన తటపటాయింపు కూడా ఉంది. నిజమైన భయా లూ ఉన్నాయి.ముస్లింలు దీనిని అధిగమించడం అవసరం. దానికి ప్రజాతంత్ర శక్తులు తోడ్పడడం అవసరం. మా పార్టీలోకి రండి, మా సంఘంలోకి రండిఅని ఆహ్వానించడంకాక మీ హక్కుల కోసం, మీ ప్రత్యేక సమస్యల పరిష్కారం కోసం మీరు సం ఘటితం కండి, మేము తోడు ఉంటామని చెప్ప డం అవసరం

ముసురుకుంటున్న మెజారిటీ మత భావజా లం బలవంతుడి కన్నా బలహీనుడి పక్షం వహిం చడమనేది మానవత్వమనిపించుకుంటుంది. మ హాత్ములు, మేధావులు, ఆలోచనాపరులంతా చరి త్రనిండా చేసిందదే. అల్పసంఖ్యాకులుగా ఉన్న ముస్లిం, క్రైస్తవ తదితర మతస్తుల విశ్వాసాలను సైతం పరిగణలోకి తేసుకోని గౌరవించడం, మెజా రిటీ మతస్తుల భావాల్ని వాళ్లమీద బలవంతంగా రుద్దకపోవడమే కదా సెక్యులరిజమంటే! దానికి విరుద్దంగామనదేశంలో ఎన్నోజరిగాయి. ప్రస్తుతం ఆ ధోరణి తీవ్రస్థాయికి చేరింది. అన్ని వైపుల్నించి మెజారిటీ మత భావజాలం  పెరుగుతూ వస్తున్న ది.సినిమాలు, పుస్తకాలు చివరకు పత్రికలు సైతం మెల్లగా అటువైపు మొగ్గుతున్నాయి.లౌకిక బావ నను నిలబెడుతూ వస్తున్న వాటిల్లో ముందు వరు సలో నిలిచేది మొదట్నుంచీ పత్రికలే. గుజరాత్‌లో ముస్లిం ఊచకోతను పత్రికలే అధికంగా ప్రజలకు తెలియజేశాయన్న అక్కసుతో మోడి గెలవగానే బీ జేపి పత్రికలు విరుచుకుపడడాన్ని గమనించోచ్చు. అట్లాంటి పత్రికలు సైతం మెల్లమెల్లగా మారుతుం డడాన్ని గమనిస్తే భయం కలుగుతోంది మెజారిటీ మత భావజాల పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వాటినుంచి రావాల్సిన ఆడ్స్‌ కోసం పత్రి కలు లోంగడం కనిపిస్తుంది. అట్లే డబ్బు కోసం సంచుల కోసం కుడా గుజరాత్‌లోనైతే సందేశ్‌, గుజరాత్‌ సమాచార్‌ అనే ముఖ్యమైన పత్రికలు ప్రభుత్వ కాషాయ మూకల పక్షం వహిస్తు ముస్లిం ల ఊచకోతకు ఆజ్యం పోసిన విషయం ఎన్నొ రిపోర్టులే కాక అక్కడి ప్రజలు ఘంటాపదంగా చెప్తున్నారు. ప్రముఖ పత్రికల్లో కోందరు పేరుమో పిన కాలమిస్టులు సైతం తమ కలాల్లో కాషాయ సిరా నింపుకుని రాస్తున్న రాతలు చదువుతున్నాం. ఈ మద్యకాలంలో ఇక తెలుగు దినపత్రికలో బీజే పి రాజ్యసభ సభ్యుడొరు అదే పనిగా మైనారిటీ లకు వ్యతిరేకంగా రాస్తున్నా రాతల్ని వారానికో వ్యాసంగా వేసుకోవడం ఎంత ఘోరమో అందరూ అనుకుంటున్నదే.అట్లా ఒక్క రాజకీయపార్టీకే కాల మిచ్చి వారి వక్ర బావజాలాన్ని ప్రచారం కానివ్వ డాన్ని గమనిస్తే కొన్ని పత్రికలు చాపకింద నీరు లాగా ఏం పని చేస్తున్నాయో అర్థమవుతుంది. అం తగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేని విష యాల్ని సర్వామోదం లేని అంశాల్ని సైతం పత్రి కలు అతి ఆసక్తితోనూ ప్రత్యేకంగానూ ప్రచురిస్తుం డడంతో అనవసర ప్రచారం కల్పించినట్లవు తోంది. దాంతో విలన్లు హీరోలయ్యే ప్రమాదమేర్ప డుతోంది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే మొదటగా ఇబ్బందుల పాలయ్యేది తామేననే విషయం పత్రి కలవాళ్లు విస్మరించదగ్గది కాదు.

సినిమాల్లో తాము సృష్టించిన ముస్లిం పాత్రల్ని సెక్యులర్‌గా చూపుతూ ఇతర ముస్లిం పా త్రల్ని ఉగ్రవాదులుగా, విలన్లుగా చూపడం మా మూలైపోయింది. ఉదాహారణకు ‘ఖడ్గం’ సినిమా లో దర్శకుడు సృష్టించిన ప్రకాష్‌రాజ్‌ పాత్ర సెక్యు లార్‌ భావజాలంతోను, అతని తమ్ముడిని ఉగ్రవా దిగానూ చూపుతారు. ఇక్కడ దర్శకుడు హిందూ వులు ప్రకాష్‌రాజ్‌లాగా ఉండాలని కోరుకుంటు న్నట్లు, ముస్లింలేమో అతని తమ్ముడిలాగా ఉన్నట్లు కన్పించే ప్రమాదాన్ని విస్మరించడం సరైందికాదు. ఆ మధ్య అంతా మెచ్చుకున్న ఐతే సినిమాలోనూ ముఖ్యమైన విలన్‌ను, అతని అనుచరులనంతా ముస్లింలుగా చూపెట్టి బాలన్స్‌ చెయ్యడానికన్నట్లు పోలీస్‌ ఆఫీసర్‌ను కూడా ముస్లింగా చూపెట్టారు. కాని విలన్‌ పాత్ర గుర్తున్నట్లుగా పోలీస్‌ పాత్ర గు ర్తుండదు. ఇట్లా చాలా సున్నితమైన విషయాల్ని కావాలని రచ్చ చేస్తూ, ముస్లింలకు నష్టం కలిగిం చే పని చేస్తు లబ్దిపోందాలని సినీ నిర్మాతలు, దర్శ కులు ప్రయత్నించడం ఎక్కువవుతుంంది. ప్రముఖ హీరోలు సైతం మత చిహ్నల్ని వాడుకోని ఈలలు కొట్టించుకోనడం, ఎన్నో సన్నివేశాల్లో, పాటల్లో మతాన్ని వాడుకోనడం కనిపిస్తుంది. టీవీ ఛానళ్ల లో మెజారిటీ మత భావజాల చిత్రీకరణలు విపరీ తమవ్వడం చూస్తున్నాం. ఇక రాజకీయ నాయకు ల కార్యక్రమాలే కారక ఝ్రబుత్వ కార్యక్రమాలు, ప్రారంత్సవాలు వగైరా మెజారిటీ మత పద్ధతుల్లో జరగడం మామూలైపోయింది. ప్రభుత్వ కార్యాల యాల్లో దేవుళ్ల పటాలు పెరిగిపోతున్నాయి. ఇతర మతస్తులు, కులస్తులు కూడా ఉద్యోగస్తుల్లో ఉం టారనే కనీస ఆలోచన కూడా చేయకుండా చాలా పనులు మెజారిటీ మత హవజాలంలోనే జరుపు తుండడం, చివరికి బస్సుల్లో సైతం దేవుళ్ల పటా లు వెలుస్తుండడం సరైంది కాదు.

సాహిత్యంలోనూ ఈ పోకడలు నకన్పిస్తున్నా యి. చైతన్యవంతులైన కొందరు కవులు సైతం తమ రాతల్లో మెజారిటీ మత భావజాలాన్ని జోప్పి స్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రముఖ కవి గొద్రా మంటల్లో గుజరాత్‌ అంటూ మొదలయ్యే ఓ కవిత రాసి ఇరు మతోన్మాదుల్ని తాను ఏకకాలంలో ఖం డిస్తున్న సెక్యులరిస్టునన్నట్లు కనిపిస్తారు. విప్లవ భావజాల పార్టీలేకాకా రచయితలు సైతం ఈ ఇరు మతోన్మాదుల ఖండన కారర్యక్రమాల్లో పడి పరోక్షంగా మెజారిటీ మతోన్మాదులకు ఉపకారం చేస్తున్నామన్న విషయాన్నే గమనించడం లేదు మతోన్మాదులను సమర్థించడం లేదు,వారట్లా మారడానికి కారణాల్ని గమనించాల్సి ఉంటుంది. ఆ మద్య ఒక పత్రికలో అచ్చయిన అమ్మవారి న వ్వుఅనేకథపైఎంతోచర్చఅయ జరిగింది. అమ్మోరు అనే సినిమా పేరుకి ఈ కథ పేరుకీ పెద్ద తేడా ఉన్నట్లు అన్పించదు. అందులో రచయిత రాసిన  అనేక విషయాలు ముస్లింలకు వ్యతిరేఖంగా ఉన్నా యి. ఆ విషయాన్ని ప్రశ్నించినవాళ్లకి రచయిత కనీసంగా కూడా సమాధాన మివ్వకపోవడం గమ నార్హం. ఆయన రాసిన కొన్ని విషయాలకు, సంఘ్‌ పరివార్‌ నోటినుంచి వచ్చే విషయాలకు తేడా లేక పోవడం విస్మయం కలిగించింది.

ఆ మధ్య వార్త పత్రికలో వందేమాతరం పట్ల ముస్లింల, ఇతర మైనారిటీల విముఖత ఎందుకు అనే అంశంపై మహబూబ్‌ బాషా బభాదుర్‌ మం చివ్యాసాన్నిఅందించారు. నిజంగానే ఆ విషయం తోంబై శాతం మందికి తెలియదు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అనే నినాదం గోడలమీద కన్పించినప్పుడు అట్లా ఎం దుకు అంటున్నారో ముందు అర్థంకాకపోయ్యేది. అర్థంకాకపోయినా ఆ వ్యాసంలో వ్యక్తమయ్యే జబ ర్దస్తీ సరైంది కాదనిపించింది వెంటనే వ్యతిరేకిం చబుద్దయ్యేది. తర్వాత్తర్వాత్త వందేమాతరం వెనక ఆనందమఠం ఆ వెనక బంకించంధ్ర  భావజాలం తెలిసింది. అదే విషయాన్ని మహాబూబ్‌ బాషా బాగా విశ్లేసించారు. ఆ వ్యాసంమీద వచ్చిన విమ ర్శనా లేఖలు కూడా పైన పేర్కోన్న మెజారిటీ మత భావజాలంలోనే ఉన్నాయి. మహబుబ్‌ బాషాలాం టివారో, మరోక ముస్లిమేతర వ్యాసకర్తో ఇట్లాంటి చైతన్యవంతుల్లో విప్లవవాదుల్లో ఇట్లాంటి వాటి పట్ల ఆసక్తి తగ్గడం మజారిటీ మత భావజాలం పెరుగుతున్న వాల్లు పత్రతికలు రాతలవైపు దృష్టి పెట్టడం అనేవి కారణాలు కావచ్చు. కోత్తగా వస్తు న్న తరాలు ఇట్లాంటి ఎన్నో అనుమానాల్లో పడడం మామూలే. కాని మేధావులైన, ఆలోచనాపరులైన పెద్దవాళ్లకు ఈ విషయాలు మామూలుగా అన్పిం చి స్పందించక పోతుండడంతో శత్రు భావజాలం పెరిగే అవకాశాన్నిచ్చిన వాళ్లవుతున్నారు. కొత్త తరాలురాతలకుదూరంగాఉండడం, పాత తరాలు పట్టించుకోకపోతుండడంతో మూఢత్వమే పెరుగు తూ వస్తున్నది.

వందేమాతరం వ్యాసంపై వచ్చిన లేఖల్లో ఏ రాజ్యమన్నా సెక్యులర్‌గా కోనసాగుతుంన్నదా? అనే ప్రశ్నే ప్రధానంగా వ్యక్తమయ్యింది. ఇలాంటి భావం చాలామందిలో వ్యక్తమవుతుంది. ఇతర దేశాలు సెక్యులర్‌గా లేనప్పుడు మనమెందుకుం డాలి అనే ఈ భావజాలం ఇతరులు న్యాయంగా లేనప్పుడు మనమెందుకుండాలి అన్న దాంతో సమానం. పాకిస్తానైనా, వాటికనైనా, అమెరికానై నా మరోకటైనా సెక్యులర్‌గా ఉండాలనే అందరూ కోరుకునేది. అవి అట్లా లేవంటే వాటి నియంతృ త్వమో, అహంభావమో, అజ్ఞానమో, వెనుకబాటు తనమో కారణమని తెలిసిందే. భారత దేశాన్ని విటికన్న భిన్నమైనదిగా అందరూ భావిస్తున్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతుల వా ళ్లు ఇక్కడ కలిసిమెలసి ఉంటున్నారు. రకరకాల కారణాల వల్ల ఇక్కడ కొన్ని జాతుల మత మార్పి డులు పొందాయి. ఇక్కడి క్రైస్తవులు ఎక్కడి కారో కానట్లే ముస్లింలూ ఇక్కడివాతరే. అంతా మతాలు మారిన ఇక్కడి భారత జాతివారే. ఏ మతంలో కొనసాగడానికైనా ప్రాథమికంగా హక్కు ఉంది. అట్లే అన్ని హక్కులూ సమానంగా ఎవరైనా పోం దాల్సిందే. ఎవరిమత విశ్వాసాలకు కూడా భంగం కలగకుండా సర్వామోదంతో ముందుకు సాగడమే శ్రేయస్కరం. అదే భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఉన్నతంగా నిలుపుతుంది.

-ఎస్‌.కె. యూసుఫ్‌ బాబా (స్కైబాబ)

ఇంకావుంది…