తెలంగాణ మాట్లాడకుండా ఎట్లుంటం.. బరాబర్‌ మాట్లాడుతం

తెలంగాణ కంటే పెద్దముచ్చటేముంది

బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ కేకే
హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణపై చర్చించ వద్దనడానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎవరని మాజీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివా సాన్ని విద్యార్థులు ముట్టడించడంతో వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం ఈనెల 28న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణపై మాట్లాడవద్దని బొత్స సూచించడం సరికాదన్నారు. ఇలాంటి మాటాలతో ప్రజలకు దూరమవుతామని, అలాంటి చర్యలకు ఎప్పటికీ పాల్పడవద్దని సూచించారు. కేంద్రం హోం శాఖ అఖిలపక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరికి పిలవడంపై ఆయన మండిపడ్డారు. నాన్చే ధోరణితోనే కేంద్రం నాటకాలాడుతోందని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమె త్తారు. తెలంగాణ విషయంలో అఖిలపక్షానికి పార్టీ అధ్యక్షులనే పిలవాలని, ఈ మేరకు కాంగ్రెస్‌ నేత లంతా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ మాట్లాడ కుంటే ఎట్లుంటమని, బరాబర్‌ మాట్లాడి తీరుతామని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే తాము వ్యవహరిస్తామని, తెలంగాణ అంశం తర్వాత మిగతా విషయాలన్నారు.