దుబాయ్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయ్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌ (43) ఈ నెల 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు ఈ రోజు సమాచారమందింది.  ఉపాధికోసం అప్పులు చేసి రెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకోవడవంతో భార్య జ్యోతి, కొడుకులు చరణ్‌, కరణ్‌లు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీనివాస్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రభుత్వం సహకరించాలని బంధువులు కోరుతున్నారు.