యూరియా ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలని రేపు సిరికొండలో బీఆర్ఎస్ మహాధర్నా
సిరికొండ జూన్ 15(జనం సాక్షి ): యూరియా పంపిణీలో అమలు చేస్తున్న “యూరియా ఆఫ్” విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత విధానంలోనే రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.యువ నాయకులు, సిరికొండ పులిబిడ్డ శ్రీ బాజిరెడ్డి జగనన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుండగా, మండలంలోని అన్ని గ్రామాల రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.ప్రస్తుతం రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్‌లైన్ విధానంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయనున్నారు.



