తోమ్మిదవ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి

21వేల ఏకరాల ఆయకకట్టు వరకు కాలువ పనులు పూర్తి చేయాలి

గంభీరావుపేట ,జూన్ 15 : (జనం సాక్షి ); నర్మాల ప్రాజెక్టు పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం సి పి ఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షతన ఏగువ మానేర్ గేస్ట్ హౌజ్ లో సోమవారం జరిగింది, నర్మల ప్రాజెక్టు మనుగడ కోసం భవిష్యత్ తరాలకు నీటి భద్రత కోసం మనమందరం కలిసి పోరాడుదామని , ఏగువ మానేర్ లో 75 ఏళ్లు పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని శిథిలావస్థలో ఉన్న కాలువలకు తక్షణమే మరమ్మత్తులు చేయాలని ప్రాజెక్టు రక్షణ కోసం ఆఫ్రాన్ నిర్మాణం చేపట్టాలని టేబుల్ సమావేశంలో తీర్మానించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలకు చెందిన నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ చైర్మన్ కనకయ్య
ఎగువ మానేరు పరిరక్షణ సమితి కన్వీనర్ ఓరుగంటి తిరుపతి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు మదాల కుమార్ స్వామి మార్వాడి సుదర్షన్ ఆడ్వకేట్ సాయి , ఎంఆర్పిఎస్ నాయకులు చంద్రం మండల కన్వీనర్ మాజార్
రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన కమిటీ జిల్లా కన్వీనర్ వేణు మాజీ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ సోద్దీన్ మాజీ సర్పంచ్ రమేష్ వివిధ మండలాల నాయకులు ద్యాప దేవయ్య బండారి బాల్ రెడ్డి, వెంకటి కూర సురేష్ , పెద్ది గారి శ్రీనివాస్ వివిధ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు,

తాజావార్తలు