మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పర్వతగిరి

పాఠశాలలను సందర్శించిన యంఈఓ

పర్వతగిరి: జూన్ 15: (జనం సాక్షి) పాఠశాలల పున ప్రారంభం రోజున పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి సోమారం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయానికి హాజరయ్యారు. అనంతరం రికార్డ్స్, రిజిస్టర్ లు కొత్త అడ్మిషన్ల వివరాలను పరిశీలించిన అనంతరం ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో నిర్వహించవలసిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చే పంపిణీ చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ను ఆయన చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థినిలకు పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోమవారం ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఎం.డి గౌస్ మొహియుద్దీన్ పాఠశాల చైర్మన్ రజిత , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు నారాయణరెడ్డి సంపత్ రావు శైలజ కవిత పాల్గొన్నారు.

తాజావార్తలు