దుర్గామాత దీక్ష తీసుకున్న బండి సంజయ్

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రతి ఏటాచేపడుతున్న అమ్మవారి దీక్షను శుక్రవారం కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో తీసుకున్నారు. గురువారం రాత్రి పెద్ద అంబర్ పేట్ లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు భారీ బహిరంగ సభ అనంతరం నేరుగా కరీంనగర్ వచ్చిన బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకొని, పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. సమస్త హిందూ మానవాళి, సమాజ శ్రేయస్సు కోసం అమ్మవారి దయ, చల్లని చూపులు దీవెనలు ప్రజలందరి పై ఉండాలని ప్రతి ఏటా దీక్ష తీసుకుంటున్నట్టు బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు.