దేశంలో కొత్తగా గా 25,467 కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢల్లీి,ఆగస్ట్24(జనంసాక్షి): భారత్‌లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. సుమారు 39,486 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేషన్ రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వం వెల్లడిరచింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాలను వేశారు.