ధరలు పెరిగాయి, ఆదాయం మాత్రం పెరగలేదు: చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన మాట్టాడుతూ ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్‌ కనెక్షన్‌ కవాలంటే రూ.5 వేలు కావాలన్నారు. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరగడంతో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయన్నారు. తోమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనే రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆరోపించారు. పేదలను ఇళ్లు లేకుండా గుడిసెల్లో ఉంచిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని చంద్రబాబు విమర్శించారు.