నగర రోడ్లు అధ్వాన్నం
– ఇలాగైతే విశ్వ నగరం ఎలా సాధిస్తాం
– మంత్రి కేటీఆర్ అసహనం
– నిర్వహణ బాధ్యత ప్రవేటుకు అప్పగింత
హైదరాబాద్,జూన్ 20(జనంసాక్షి):సరైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు లేకుండా హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఎలా అవుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. నగరంలో రోడ్ల నిర్వహణ చెత్గా ఉందన్నారు. రోడ్లు వేస్తున్న తీరు, తవ్వుతున్న వ్వయహారాలపై ఆయన అసహనం వ్యక్తం చేశరాఉ. రహదారుల దుస్థితిపై సోమావరాం ఆయన ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మధ్య సమన్వయలోపం ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్న సౌకర్యాలు అందించేలా అధికారులందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం విషయంలో అధికారులు సగటు పౌరుడిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యలపై అధికారులతో మంత్రి కేటీఆర్ సవిూక్షించారు. రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని, చిన్న వర్షానికే రోడ్లపై చెరువులను తలపించేలా నీళ్లు నిలుస్తున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్‌రోడ్డు మాదిరిగా నగరంలో వున్న అన్ని రోడ్లు ఉండాలని ఆయన సూచించారు. గరంలో చిన్నపాటి వర్షానికే రహదారులన్నీ గుంతలమయంగా మారిపోతున్నాయని… వీటి నిర్వహణకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజన లేకుండా పోతోందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారుల బాధ్యతలను సర్కిళ్ల వారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు సంస్థలకు 3-5ఏళ్లకు నిర్వహణ ఖర్చులు భరించేలా ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. బాహ్య వలయ రహదారి తరహాలో నగరంలోనూ ఉండాలని… దీనికోసం చట్టంలో మార్పులు తీసుకొస్తామన్నారు. సవిూక్షలో కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మున్సిపల్ శౄఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజి గోపాల్, మేయర్ బొంతు రామ్మోమన్, డిప్యూటి మేయర్ ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే చైనాలోని హైనన్ ప్రావిన్స్‌కు చెందిన పలువురు ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. ఈమేరకు హైనన్ ప్రావిన్స్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం నవంబర్‌లో చైనాలో పెట్టుబడుల సదస్సుకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ప్రతినిధుల ఆహ్వానాన్ని కేటీఆర్ మన్నించారు. తాను చైనాకు వచ్చినపుడు తప్పకుండా హైనన్ నగరాన్ని సందర్శిస్తానని హావిూ ఇచ్చారు.