మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

సదాశివపేట డిసెంబర్ 29(జనం సాక్షి)పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం నుంచి జరుగుతున్న శాసనసభ సమావేశంలో తమ సమస్యల పరిష్కరించాలని మాజీ సర్పంచ్ ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ వెళుతున్న మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ క్రమంలో పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన బిల్లులు, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, గొల్లగూడెం సర్పంచ్ మునిగే నవీన్ కుమార్, వెల్టూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి, పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, కంబాలపల్లి సర్పంచ్ శ్రీహరి, బొబ్బిలి గామ సర్పంచ్ నల్లోల కుమార్ ఉన్నారు.


