ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షి)
ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సమస్యలతో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యను విని, సమస్యకు కారణమవుతున్న అంశాలపై సంబంధిత ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు భరోసా కల్పించాలని, సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని ఎస్.హెచ్.ఓలకు సూచించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మీ సమస్యలు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


