అమెరికాలో రోడ్డు ప్రమాదం
` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం
మహబూబాబాద్(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడిరది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.



