జలద్రోహం ఎవరిదో తేలుస్తాం
` ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలను బయటపెడతాం
` పాలమూరుకు బీఆర్‌ఎస్ హయాంలో తీరని అన్యాయం
` పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం
` డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు
` పైగా 90శాతం పనులు పూర్తయ్యాయనే దుష్ప్రచారం
` మండిపడ్డ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి): ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్ రావుకు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. హరీశ్‌రావు దిగుజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలు బయటపెడతామన్నారు. ఈ సందర్భంగా పాత జీవో కాపీలను విూడియాకు చూపించారు. కృష్ణా జిల్లాల్లో మేము 90 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. కానీ, 45 టీఎంసీలు అడిగామని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. అబద్ధాల పునాదుల విూదే భారత రాష్ట్ర సమితి బతుకుతోందని.. తెలంగాణకు అన్యాయం జరిగేలా తాను ఎందుకు లేఖ రాస్తారని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రజెంటేషన్‌కు తాము సిద్ధమని వెల్లడిరచారు. మేడిగడ్డ మరమ్మతులపై ఎల్‌అండ్‌టీకి నోటీసులిచ్చామని తెలిపారు. మేడిగడ్డలో పలు పరీక్షలు, ఇతర తనిఖీలకు ఎల్‌అండ్‌టీ అంగీకరించినట్లు చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ పనులు మొదలవుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
పాలమూరుకు బీఆర్‌ఎస్ హయాంలో తీరని అన్యాయం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్‌ఎస్ హయాంలో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాగునీటి జలాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకానితనాన్ని మంత్రి ఎండగట్టారు. 2015లో ఈ ప్రాజెక్టు కోసం జీవో జారీ చేసినప్పటికీ, కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించడానికి నాటి ప్రభుత్వానికి ఏడేళ్ల మూడు నెలల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ఆశ్చర్యకరంగా, డీపీఆర్ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు చేశారని, ఇది వారి పాలనలోని అస్తవ్యస్త విధానాలకు నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి, దాని సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిన కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రం వివక్ష చూపారని ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ప్రాజెక్టు పనులను ఉద్దేశపూర్వకంగానే నెమ్మదిగా చేయాలని నాటి రాజకీయ పెద్దలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండిరచారు. అసలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 70,000 కోట్లకు పైగా ఉంటే, బీఆర్‌ఎస్ హయాంలో జరిగింది కేవలం రూ. 27,000 కోట్ల పనులు మాత్రమే. ఇది 90 శాతం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. పెండిరగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి వాటిని కూడా తొమ్మిదిన్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తమ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతోనే పూర్తి చేసి తీరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము అధికారంలోకి వచ్చాక 11 పంపుల ఇన్‌స్టాలేషన్ పూర్తి చేశామని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌నని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు.ఎవరి హయాంలో ఏం జరిగిందో అంతా బయటపెడతామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని చెప్పుకొచ్చారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్పచ్రారం చేశారని ్గªర్ అయ్యారు. అబద్దాల పునాదులపై బీఆర్‌ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ.. అదే నిజం అవుతుందనుకుంటున్నారని మండిడ్డారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఓ పేరాగ్రాఫ్‌ను అవుటాఫ్ కాంటెక్ట్స్ తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా తానెందుకు లేఖ రాస్తానని ప్రశ్నించారు. సీడబ్ల్యూకి రాసిన లేఖలో ఒక భాగాన్నే చూపిస్తున్నారని.. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రెజెంటేషన్‌కు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మేడిగడ్డ పునర్నిర్మాణం పనులకు డెడ్‌లైన్ పెట్టామని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్‌ఎస్ నేతల చేతకాని తనాన్ని తమపై రుద్దవద్దని హితవు పలికారు. వారు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సాగునీటి జలాలపై డీపీఆర్‌ను కేంద్రానికి పంపడానికి ఏడేళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. డీపీఆర్ పంపే సమయానికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు..అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్‌ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.



