నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

share on facebook

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు
సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్‌ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్టలో భూపాల్‌ రెడ్డి సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగులమ్మ ఆలయ ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపణతో ఓల్డ్‌ ఆర్సీపురంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పుష్ప, మాజీ కార్పొరేటర్‌ తొంట అంజయ్య, కుమార్‌ గౌడ్‌, మోహన్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, ఆదర్శ్‌ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మా రెడ్డి, సోనూ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.