నార్మాక్స్ డైరెక్టర్ గా మందడి ప్రభాకర్ రెడ్డి*
రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి) నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికలలో
నార్మాక్స్ డైరెక్టర్ గా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామానికి చెందిన మందడి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో ఎన్నికైనారు. మంగళవారం మదర్ డైరీ ఆవరణలో జరిగిన ఎన్నికలలో 270 ఓట్లకు గాను 207 ఓట్లు ప్రభాకర్ రెడ్డి కి రావడంతో ప్రత్యర్థిపై గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.