నాలుగు సినిమాలకు 500కోట్ల మాటే


ప్రభాస్‌ రాబడిపై సినీవర్గాల్లో టాక్‌
వరుస చిత్రాలతో ప్రభాస్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల ద్వారా ఎంతలేదన్న ఓ 500కోట్లు రాబడి
ఉందని టాక్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో ’రాధేశ్యామ్‌’.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ’సలార్‌’.. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ’ఆదిపురుష్‌ 3డి’…నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆది పురుష్‌ `3డి చిత్రంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇవన్నీ పాన్‌ ఇండియా కేటగిరీలో రూపొందుతున్న భారీ బ్జడెట్‌ చిత్రాలే. నాలుగు చిత్రాల బ్జడెట్‌ లు ఏకమొత్తంగా సుమారు 1600 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ సినిమాల నుంచి డార్లింగ్‌ సంపాదన ఎంత? ఒక్కో సినిమా నుంచి ఏమేరకు పారితోషికం తీసుకుంటున్నారన్నది ఆరా తీస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి. ఈ నాలుగు సినిమాల నుంచి ప్రభాస్‌ దాదాపు 500 కోట్ల మేర ఆర్జిస్తున్నారని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌ ఒక్కో సినిమాకి 100కోట్ల పారితోషికం ఏరియా వైజ్‌ హక్కులు ఛేజిక్కించుకుంటున్నారన్న సమాచారం ఉంది. ప్రస్తుతం సెట్స్‌ పై ఉన్న ఆదిపురుష్‌ 3డి దాదాపు 400కోట్ల బ్జడెట్‌ తో తెరకెక్కుతోంది. కేజీఎఫ్‌ ప్రశాంత్‌ నీల్‌ తో సలార్‌ చిత్రానికి 200`300 కోట్లు పైగానే పెడుతున్నారు. రాధేశ్యామ్‌ కి 150కోట్లు పైగానే ఖర్చు చేశారన్న సమాచారం ఉంది. అలాగే నాగ్‌ అశ్విన్‌ ` వైజయంతి మూవీస్‌ చిత్రానికి 500 కోట్లు పైగా బ్జడెట్‌ పెడుతున్నారని కథనాలొస్తున్నాయి. కేవలం నాలుగు సినిమాలకు ఇంత పెద్ద మొత్తం పారితోషికం అందుకున్న వేరొక హీరో లేరు. ఇదే గనుక నిజమైతే అతి తక్కువ సినిమాలకు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్‌ సరికొత్త రికార్డు సృష్టించినట్లే. బాహుబలి సినిమాకు ప్రభాస్‌ పారితోషికంతో పాటు లాభాల్లో భారీగా షేర్‌ ని కూడా తీసుకున్నారు. ఇటీవల పెరిగినే క్రేజ్‌ నేపథ్యంలో తాజా చిత్రాలకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు ప్రభాస్‌ తో ముందే నిర్మాణ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అటు యష్‌ రాజ్‌ సంస్థ.. ధర్మ ప్రొడక్షన్స్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ ని లాక్‌ చేసేందుకు 100కోట్ల పారితోషికాన్ని ఆఫర్‌ చేసాయని ఇంతకుముందు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ సంక్రాంతి 2022 కానుకగా విడుదలవుతుంది. ఆ తర్వాత సమ్మర్‌ కి ఇయర్‌ ఎండ్‌ కి డార్లింగ్‌ ట్రీట్‌ ఉంటుంది. ఆదిపురుష్‌ 3డి.. సలార్‌ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజవుతాయి. నాగ్‌ అశ్విన్‌ తో సినిమాకి రెండేళ్ల సుదీర్ఘ సమయం పడుతుందని సమాచారం.