నాలుగో వన్డేలో శ్రీలంకపై పాకిస్థాన్‌ ఓటమి

శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ కు మరో ఓటమి ఎదురైంది.శనివారం జరిగిన నాలుగో వ న్డే మ్యాచ్‌లో అతిథ్య లంకజట్టు చేతిలో పాకిస్థాన్‌ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌ లో లంక పేసర్‌ తిషారా పెరీరా చెలరేగాడు.ఓకే ఓవర్లో హ్యాట్రిక్‌ సాధించడంతో పాటు ఓ రనౌట్‌ చేసి మిస్బాసేనను ముప్పు తిప్పలు పెట్టాడు. ఫలి తంగా ప్రేమదాసాస్టేడియంలో శనివారం జరిగి న ఈ మ్యాచ్‌లో లంక 44పరుగుల తేడాతో పాక్‌ ను చిత్తు చేసింది.దీంతో ఐదు మ్యాచ్‌ల సీరిస్‌లో 2-1 అధిక్యాన్ని సంపాదించింది.ఈ మ్యాచ్‌లో తోలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన లంక జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది.సంగక్కర 97 ,జయవర్థనే 40 పరుగుల తో రాణించారు.అనంతరం 244 పరుగుల విజ య లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 45 ఓవ ర్లలో 199 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. అజహార్‌ అలీ 81 నాటౌట్‌ మినహా మిగిలిన బ్యా ట్స్‌మెన్‌లు పెద్దగా రాణించలేదు.పాక్‌ ఇన్నింగ్స్‌ లో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ లు డకౌట్‌ కావడం విశేషం