నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన
బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
బండిది విహారయాత్ర అంటూ రసమయి ఎద్దేవా
సిరిసిల్ల,సెప్టెంబర్25 (జనంసాక్షి) నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్ నైజాన్ని బయటపెడతామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే… నిరుద్యోగ భృతి ఏమాయే? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యావంతులైన యువతీ, యువకులను మోసగించారని
అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు ఉపాధి కల్పించడం కోసం కాదన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎందరో యువతీ యువకులు అశలు పెట్టుకున్నారని కానీ వారి అశలు అడియాశలు అయ్యాయని అన్నారు. ఉద్యోగాలు దొరక్క యువతీ, యువకులు ఆవేదన చెందుతున్నారని అనేక చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అయితే బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నట్టుందని ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రసమయి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ సంజయ్‌పై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సంజయ్ విహారయాత్ర చేస్తున్నట్టుందని ఆయన