‘నీలం ‘ బాధితులను అదుకోవాలి
ఖమ్మం : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, నీలం తుపాను బాదితులను అదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పి. బాలరాజును సీపీఐ, న్యూడెమొక్రసీ అధ్వర్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని అర్అండ్బీ అతిది óగృహంలో ఉన్నమంత్రిని కలిసేందుకు వెళ్లిన సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలను పోలిసులు అడ్డుకున్నారు. దీంతో వారు అందోళన చేపట్టారు. మంత్రిని కలిసేందుకు ప్రత్యేక బృందాన్ని పోలిసులు అనుమతించడంతో వారు అందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు నర్సయ్య, కె. రంగయ్య తదితరులు పాల్గోన్నారు.