నేత కార్మికుడు ఆత్మహత్య
కరీంనగర్: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం రూ. 2లక్షల అప్పును తీర్చలేననే మనస్థాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. మర మగ్గాలు నడవక పోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అయన భార్య రమా తెలిపింది.