పతకాల నమోదులో భారత్‌ వెనుకంజ

చైనా 29.. అమెరికా 27..స్వర్ణాలతో ముందంజ
లండన్‌లో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమై సోమవారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఆది నుంచి పతకాల పట్టికలో చైనా, అమెరికా అథ్లెట్లు పోటీలు పడుతూ ప్రధానంగా స్వర్ణ పతకాల్లో తొలి ఒకటి, రెండుస్థానాల్లో ఉండేందుకు పోటీలుపడుతున్నారు. మనదేశ అథ్లెట్లు వీరోచితంగా పోరాటం సాగించినప్పటికీ మూడు పతకాలనే కైవసం చేసుకున్నారు.వాటిల్లో ఒకటిరజతం కాగా మరోరెండు కాంస్యపతకాలు మొత్తం మూడుపతకాలు మాత్రమేసాధించారు.మరో వారం రోజుల్లో లండన్‌ క్రీడలు ముగియనుండడంతో ఒక్కస్వర్ణమైనాభారత్‌అథ్లెట్లు సాధిస్తారా..అన్నదానిపై సర్వత్రాచర్చ సాగుతోంది. చిన్నదేశాల అథ్లెట్లుసైతం రాణిస్తుంటేమనవాళ్లు ఆయాక్రీడల్లో సర్వశక్తులుఒడ్డి పోరాడుతున్నప్పటికీ రజతం, కాంస్యలకే పరిమితమవుతుండడం పట్ల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మరో ఆరురోజులు సమయం ఉన్నందున మన అథ్లెట్లకు బెస్టాఫ్‌లక్‌ చెబుదాం.
తాజాగా ఆదివారం నాటి ఫలితాల నేపథ్యంలో.. చైనా 29 స్వర్ణాలతోను, అమెరికా 27 స్వర్ణాలతోను తొలిరెండు స్థానాల్లో నిలిచాయి. చైనా 29 స్వర్ణాలు, 16 రజతాలు, 14 కాంస్యాలు.. మొత్తం 59 పతకాలు సాధించి అగ్రభాగాన నిలిచింది. అమెరికా 27 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలు.. మొత్తం 56పతకాలతో ద్వితీయస్థానంలో నిలిచింది. మూడోస్థానంలో బ్రిటన్‌ నిలిచింది. 16 స్వర్ణాలు, 10 రతజాలు, 10 కాంస్యాలు.. మొత్తం 36 పతకాలు సాధించింది. నాల్గో స్థానంలో దక్షిణ కొరియా అథ్లెట్లు నిలిచారు. 10స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలు.. మొత్తం 20పతకాలు సాధించారు. ఐదో స్థానంలో ఫ్రాన్స్‌ నిలిచింది. 8స్వర్ణాలు, 7రజతాలు, 9కాంస్యాలు.. మొత్తం 24పతకాలు సాధించింది. ఆరో స్థానంలో నిలిచిన జర్మని.. 5 స్వర్ణాలు, 10రజతాలు, 7కాంస్యాలు.. మొత్తం 22పతకాలు గెలు చుకుంది. 5స్వర్ణాలు, 5రతజాలు, 3కాంస్యాలు.. మొత్తం 13పతకాలతో ఇటలి ఏడో స్థానంలో నిలి చింది. కజకిస్తాన్‌ అథ్లెట్లు మొత్తం 5 స్వర్ణాలు మాత్రమే సాధించారు. మొత్తం 5 స్వర్ణాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకు న్నారు. ఉత్తరకొరియా 4 స్వర్ణాలు, ఒక కాంస్యం.. మొత్తం 5 పతకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రష్యా అథ్లెట్లు 3 స్వర్ణాలు, 16 రజతాలు, 15 కాంస్యాలు.. మొత్తం 34 పతకాలు సాధించి పదో స్థానంలో నిలిచారు. అలాగే నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు 3 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలు.. మొత్తం 8 పతకాలతో పదకొండో స్థానంలో నిలిచారు. భారత్‌ది పన్నెండో స్థానం. ఒక రజతం, రెండు కాంస్యాలు.. మొత్తం 3 పతకాలు మాత్రమే సాధించింది.