పింఛన్‌దారుల హెల్త్‌కార్డులకు ప్రత్యేక వెబ్‌సైట్‌

కరీంనగర్‌, డిసెంబర్‌ 9: ఉద్యోగుల, పింఛన్‌ దారులు హెల్‌కార్డులు పొందుటకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిందని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ అనంతరెడ్డి ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్‌ దారుల  యొక్క లాగిన్‌ ఐడి, పాస్‌వర్డు సంబంధిత ఎస్‌టివో, ఎపిపివో కార్యాలయాలకు పంపించినట్లు తెలిపారు. సంబంధిత పింఛన్‌దారులు తమ లాగిన్‌ ఐడి, పాస్‌వర్డులకు సంబంధించిన సమాచారమును ఎస్‌టివో, ఎపిపివో కార్యాలయం,  ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కార్యాలయంలో పొందవచ్చునన్నారు. పూర్తి వివరాలకు ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోన్‌ నెం 9701372019 లేదా 104 సేవా కేంద్రం,  పింఛన్‌దారుల అసోసియేన్‌ కార్యాలయంలో సంప్రదించి  సమాచారం పొందవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలలో హెల్త్‌కార్డు కొరకు సంబంధిత మీ సేవా కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

తాజావార్తలు