మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
` మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్(జనంసాక్షి):అత్యంత వైభవంగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణకు ఈ నిధులు వినియోగించనున్నారు.