నోటికి నల్లగుడ్డలతో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన
రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండువారాలకు చేరింది. 14 రోజులుగా వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు, కూలీలు, స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి దీక్షకు సంఫీుభావం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల నాయకులు దీక్షలకు మద్దతు తెలపగా.. వివిధ ప్రజాసంఘాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. అనుమతులు రద్దు చేసేదాకా దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా నోటికి నల్లగుడ్డలు ధరించి ఫ్యాక్టరీకి వ్యతిరేక నినాదాలు చేశారు. దిలావర్‌పూర్ ప్రజల పోరాట స్ఫూర్తితో తమ ఆందోళనలు కొనసాగుతాయని, ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా దీక్షలు కూర్చున్న వారు పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు.