అమ్మాయిలు అదరగొట్టారు
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్‌ఇండియా
డిఫెండిరగ్ ఛాంపియన్‌గా భారత్ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారత్ అక్కడా అదరగొట్టింది. రెండోసారి విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్‌ఇండియా నిలిచింది. తుది పోరులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. తెలంగాణ క్రీడాకారిణి గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది.
త్రిష తెలంగాణకు గర్వకారణం
` క్రీడాకారిణికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు
`టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు
హైదరాబాద్(జనంసాక్షి):వరుసగా రెండోసారి అండర్`19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మలేషియాలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొట్టే ఆటను ప్రదర్శించారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. త్రిష లాంటి క్రీడాకారులు మన రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. త్రిష మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.