గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష (Gongadi Trisha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆమెకు రూ.కోటి నజరానా ప్రకటించారు. అండర్‌ 19 ప్రపంచకప్‌ టీమ్‌లో మరో సభ్యురాలు ధ్రుతి కేసరి, టీమ్‌ హెడ్‌కోచ్‌ నౌషీన్‌, ట్రైనర్‌ షాలినికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. త్రిషను సత్కరించిన సీఎం.. భవిష్యత్‌లో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో త్రిష అదరగొట్టింది. టీమ్‌ఇండియా కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.

తాజావార్తలు