ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
` 11 మంది కూలీలకు తీవ్రగాయాలు
` కమలాపూర్ మండల అంబాల వద్ద ప్రమాదం
కమలాపూర్(జనంసాక్షి):హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాలీ ఆటోలో 22 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.