దావోస్‌ పెట్టుబడులు మన సర్కారు సాధించిన ఘనవిజయం

` విపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మరు
` తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
` దావోస్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు
` రాష్ట్రంతో భాగస్వామ్యమయ్యేందుకు అనేక కంపెనీ ముందుకొచ్చాయి
` వారికి అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం
` మనందరం కలిసికట్టుగా కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది
` మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రేంవత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దావోస్‌ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు దీనిని జీర్ణించుకోలేక వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో సిఎం ర ఏవంత్‌ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ప్రభుత్వంపై కొందరు చేసిన దుష్పచ్రారం పటాపంచలు అయ్యింది. ప్రభుత్వంపై, రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలామంది ముందుకు వచ్చారు. ఈ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం వివరించారు. తెలంగాణ రాష్టాన్న్రి వన్‌ ట్రిలియన్‌ ఎకానవిూగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మా ప్రభుత్వం సాధించిన కీలక విజయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దుష్పచ్రారం చేశారని మండిపడ్డారు. దావోస్‌ పర్యటనతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర పక్రియ అని చెప్పారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సింగపూర్‌ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించ డానికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకుని రావాలనేది మా ప్రయత్నం అని అన్నారు వాళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారు. మేం విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారు. ఇతర రాష్టాల్రకంటే గొప్పగా పెట్టుబడులు సాధించాం. అసూయతోనే మమ్మల్ని వారు అభినందించడం లేదు. భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపుమంటగా ఉందని పరోక్షంగా బిఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షంలో ఓ నేత అటెన్షన్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. చాలా సంస్థలు మన పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఈస్థాయిలో పెట్టుబడులు రాలేదనే అక్కసుతో ఉన్నారు. ఎనర్జీ పాలసీతోనే తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు దావోస్‌ వెళ్లాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబుడులపై ఒప్పందాలు చేసుకున్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామం‘ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనలో గతేడాది కంటే నాలుగు రేట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు, యువతకు మేలు చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా సలహా లాగే తీసుకున్నామన్నారు. సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు. సాంకేతిక నైపుణ్యం, విద్యార్థుల బదిలీ జరిగేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రూ.450 కోట్లతో స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు క్యాపిటలాండ్‌ ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మల్టీవాక్‌ గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. దావోస్‌ పర్యటనలో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఉద్ఘాటించారు. వన్‌ ట్రిలియన్‌ ఎకానవిూ దిశగా అడుగుపడిరదని చెప్పారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధిపై దృష్టిపెట్టామని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తామన్నారు. హైదరాబాద్‌ అంటేనే .. బిజినెస్‌ అనే బ్రాండ్‌ ఏర్పడిరదని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘గతేడాది దావోస్‌ సదస్సులో రూ.40వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఇది స్థిరమైన, వ్యాపార అనుకూలమైన ప్రభుత్వం అని వ్యాపారులు విశ్వసించారు. అందుకే 2024 దావోస్‌ పర్యటనకంటే ఈసారి నాలుగు రెట్లు అధికంగా ఒప్పందాలు జరిగాయి. అధునాతన సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చేలా ప్రణాళిక రూపొందించాం అని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతకు అందించేలా స్కిల్‌ యూనివర్సిటీ ప్రణాళిక ఉంది. దావోస్‌ ఒప్పందాల పెట్టుబడులతో కొత్తగా 49,500 ఉద్యోగాలు వస్తాయి. మూసీ నదిని ప్రక్షాళన చేసి నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అదిస్తాం అని శ్రీధర్‌బాబు తెలిపారు. విూడియా సమావేశంలో మంత్రి పొంగులేటి తదితరులు కూడా పాల్గొన్నారు.

 

తెలంగాణను ప్రకృతివనంగా మార్చాలి
` ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
` అందుకోసం పర్యాటక పాలసీ తీసుకొస్తా
` గత ప్రభుత్వం టెంపుల్‌ టూరిజం పట్ల నిర్లక్ష్యం వహించింది
` ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తాం
` ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
` ఇది సినిమా షూటింగ్‌లకు అద్భుతం: నటుడు చిరంజీవి
రంగారెడ్డి(జనంసాక్షి):ప్రకృతి రమణీయతకు మారుపేరుగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏటా కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నామని అన్నారు. తెలంగాణను ప్రకృతివనంగా మార్చాల్సి ఉంది. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తాం. త్వరలో విధివిధానాలు ఖరారుచేస్తాంఅని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్‌ పీరియం పార్కులో రూ.లక్ష నుంచి రూ.3.5కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. రాందేవ్‌రావ్‌ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్‌ పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్‌ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. ‘అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం అన్నారు. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉంది. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.. అనంతరం నటుడు చిరంజీవి మాట్లాడుతూ రాందేవ్‌ను కొనియాడారు. ‘పొద్దుటూరు ప్రదేశం నాకు ముందే తెలుసు. నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రాందేవ్‌ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మన హైదరాబాద్‌లోనే ఇలాంటి మొక్కలను రాందేవ్‌ తీసుకురావడం అభినందనీయం. ఆయన వ్యాపారవేత్తగా కాకుండా కళాకారుడిగా కనిపించారు‘ అని చిరంజీవి అన్నారు. ఎక్స్‌పీరియం పార్కు హైదరాబాద్‌కు తలమానికం అవుతుందని, ఒక కళాఖండంగా మిగిలిపోతుందని చిరంజీవి అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి మొక్కలు, కళాకృతులు చూస్తుంటాం. ఇండియాకు తీసుకెళ్తే బాగుండని అనిపించేది. ఇక్కడ హైదరాబాద్‌ శివారులో అవి లభిస్తున్నాయంటే, చాలా ఆనందంగా ఉంది. మా ఇంటి దగ్గర నేను రోజూ కూర్చొనే ప్రదేశంలో బయటకు కనపడకుండా ఫెన్సింగ్‌లా డిజైన్‌ చేయమంటే, రాందేవ్‌ అద్భుతంగా చేసి ఇచ్చారు. నా ఇంటి చుట్టూ చాలా చక్కని చెట్లు పెట్టుకున్నా. రాందేవ్‌ ’కొత్తగా మొక్కలు వచ్చాయి చూస్తారా’ అని అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు వాటి ధరలు వేలు, లక్షల్లో ఉండేవి. ఇప్పుడు కోట్లలో ఉంటున్నాయి. అసలే నా సంపాదన అంతంత మాత్రంగా ఉంది. కొనలేనేమో అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రితో ఇక్కడకు వచ్చి, చూస్తే ఇవన్నీ కొనేయాలనిపిస్తోంది‘ ‘ఇలాంటి వాటిని పెట్టాలంటే వ్యాపార దృక్పథం ఉంటే సరిపోదు. అందుకే రాందేవ్‌లో ఒక ఆర్టిస్ట్‌ను చూస్తా. మొక్కలపై అంత ఇష్టం లేకపోతే దాదాపు పాతికేళ్లు ప్రయోగాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న అరుదైన మొక్కలను సైతం ఇక్కడకు తీసుకొచ్చి, ఇది సాధ్యమే అని నిరూపించారు. ఎక్స్‌పీరియంలోని శిలాకృతులు మన హైదరాబాద్‌కు అందం తీసుకొస్తాయి. డబ్బులు, స్థలం ఉంటే ఎవరైనా రియల్‌ ఎస్టేట్‌ చేద్దామని అనుకుంటారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని, పెద్ద మల్టీస్టోర్‌ బిల్డింగ్‌ కడితే, తరాలు నిలిచిపోతుంది. కానీ, రాందేవ్‌ తన మదిలో ఉన్న దాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చారంటే నిజంగా హ్యాట్సాప్‌. ’ఇది షూటింగ్స్‌కు ఇస్తారా రాందేవ్‌’ అని అడిగితే, ’ఫస్ట్‌ విూ మూవీ షూట్‌ అయితే ఇస్తా’ అన్నారు. ఇప్పుడు కొత్త హీరోయిన్‌ను తీసుకొచ్చి స్టెప్పులు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందో. వచ్చే శీతాకాలంలో చూద్దాం. ఈలోగా వర్షాలు పడి, మరింత పచ్చదనం పెరుగుతుంది. ఒకట్రెండు ఏళ్లలో కంటికి ఇంపుగా ఉంటుంది. ప్రభుత్వం కూడా రాందేవ్‌ ఆలోచనలకు సహకారం అందించి, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఎక్స్‌పీరియం హైదరాబాద్‌కు అద్భుతమైన ల్యాండ్‌ మార్క్‌ అవుతుంది. హైదరాబాద్‌ ఇల్లు అనుకుంటే, ఇంట్లో చక్కని పెయింటింగ్‌ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు ఎక్స్‌పీరియం అలాంటిది‘ అని చిరంజీవి అన్నారు.
150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు
శంకర్‌ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌ పీరియం’ పార్క్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్‌ అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్‌, అందమైన శిలలు సేకరించి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్‌ బీచ్‌ ఏర్పాటు చేశారు. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్‌, పోస్టు వెడ్డింగ్‌, ఫొటో షూట్‌లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్‌కు ఐకానిక్‌గా ఎక్స్‌పీరియం ఉంటుందన్నారు.