పిల్లలో సరదాగా క్రికెట్‌ ఆడిన స్పీకర్‌


నిజామాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):: సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే చాలు వారితో కలిసి సరదాగా ఆడుకోవడం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో ఒకడిగా కలిసి గడపడం స్పీకర్‌ పోచారంకి మాత్రమే సాధ్యం. బుధవారం తన స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లి వస్తున్న స్పీకర్‌కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్‌ ఆడుతున్న పిల్లలు కనిపించగానే కారు దిగి ఇలా బ్యాటు అందుకున్నారు. పిల్లలు బాల్‌ విసరగా షాట్లు కొట్టి స్పీకర్‌ అలరించారు.