*పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆల్బెండజోల్ మాత్రలు మ్రింగించాలి*
మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): పిల్లల కడుపులో ఉన్న నులిపురుగులను నిర్మూలించడానికి మాప్ అప్ దినోత్సవం సందర్భంగా గురువారం రేపాల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో 13 గ్రామ పంచాయతీలలో అంగన్వాడి స్కూల్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లక్ష్మల్లా దిలీప్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులలో నులిపురుగులు ఉండడం ద్వారా పోషకాహార లోపం, రక్తహీనతతో ఎప్పుడూ అలసిపోతుంటారు, శారీరక మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని దీనికోసం పరిశుభ్రత పాటిస్తూ గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుభ్రమైన పండ్లు, కాయగూరలను ఎక్కువ తీసుకోవాలని, చెప్పులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్డిని వాడాలని, భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో మాప్ అప్ డే నిర్వహించి ఈ నెల 15వ తారీకురోజు వేసుకోకుండా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ, ఏఎన్ఎంలు పద్మ, పావని, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.