పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం మరుమురు వద్ద గోదావరి వరద ఉద్ధృతి కారణంగా 4 అడుగుల మేర రహదారి జిల్లా దేవిపట్నం మండలం ఉ. వీరవరంలో వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. దండంగి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం వద్ద 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.