పోలీసు చట్టానికి 150 ఏళ్లు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :పోలీస్‌ చట్టం అమల్లోకి వచ్చి 150 యేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మీ రక్షణ పోలీసు శాఖ’ పేరిట నిర్వహించిన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల రక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి పోలీసులు ఎళ్లవేళలా కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమ్యాథ్యూ, డీజీపీ దినేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పోలీస్‌ అకాడమీ ట్రైనీ ఇన్‌స్పెక్టర్లు నిర్వహించిన విన్యాసాలు అలరించాయి.