పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం.
11696 మంది అభ్యర్థులు హాజరు,832 మంది అభ్యర్థులు గైర్హాజరు.
పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ.
నాగర్ కర్నూల్ జిల్లా లో వివిధ పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎస్పీ కె మనోహర్ తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 44 సెంటర్లలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు.నాగర్ కర్నూల్ పట్టణంలో లో 23 పరీక్ష కేంద్రాలు, అచ్చంపేటలో 11 పరీక్ష కేంద్రాలు, తెలకపల్లిలో 6 పరీక్ష కేంద్రాలు, బిజినపల్లిలో 3 పరీక్ష కేంద్రాలు, పాలెంలో 1పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కేంద్రాల్లో కలిపి 12528 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11696 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. 832 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు కాలేదని ఎస్పీ కె మనోహర్ తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద డిఎస్పీలు, సీఐలు తో పాటు ఆయా పోలీసు స్టేషన్ ల ఎస్సై లు బందోబస్తు నిర్వహించారు.పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ కే మనోహర్ పర్యవేక్షించడం జరిగింది.