ప్రజలు బిజెపి విమర్శలను నమ్మరు
క్షేత్రస్థాయిలో పనులను మాత్రమే చూస్తారు: ఎమ్మెల్యే
జగిత్యాల,సెప్టెంబర్27 జనంసాక్షి అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఓ ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమని అన్నారు. అభివృద్దిలో కోరుట్లను ముందు నిలిపేలా ప్రజలంతా తనకు సహకరించాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు విమర్శలతో కలక్షేపతం తప్ప చేసిందేవిూ లేదన్నారు.
పాదయాత్రతతో బండి సంజయ్ చెప్పే కాకమ్మ కబుర్లు ప్రజలు నమ్మరని అన్నారు. విమర్శలు చేసినంత మాత్రన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాతో పాటు వంటి పథకాలతోపాటు కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను దేశ, విదేశాల ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు.