ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరిస్తాం
ఎస్పీ రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి);
ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో పరిష్కరించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలియజేశారు.
ప్రజావాణిలో లో భాగంగా సోమవారము జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజల నుండి వచ్చిన 8 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ వివాదాలకు సంబందించిన సివిల్ వివాదాలను కోర్టులలో పరిష్కరించుకోవాలని సూచించారు.కుటుంబాలలో ఆస్తి పంపకాలలో చిన్న చిన్న సమస్యలకు ఒకరి పై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటి సంఘటనల పై ఫిర్యాదులు రావడం గురించి విచారం వ్యక్తం చేశారు. భర్తల వేధింపుల పై, చీటింగ్ ల పై ఫిర్యాదులు అందాయని అందుకు కారకులు అయిన వారి పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులలో
భర్త వేధింపులకు సంబంధించి 1 పిర్యాది ,కుటుంబ తగాదాలకు
సంబంధించి 2 పిర్యాదులు,
భూ వివాదాలకు సంబంధించి 2 పిర్యాదులు,డబ్బులు తీసుకొని ఇల్లు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని 2 ఫిర్యాదులు, పొలం లో అక్రమంగా కాల్వ తీశారని 1 పిర్యాది అందిందని ఆయన తెలిపారు.